Andhra Pradesh: గల్లా, రామ్మోహన్ నాయుడు, సుజనాకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు!

  • ఈరోజు టీడీపీఎల్పీగా ఎన్నికైన చంద్రబాబు
  • గుంటూరు కార్యాలయం దూరంగా ఉందన్న నేతలు
  • విజయవాడలో పార్టీ ఆఫీసు బాధ్యతలు కేశినేనికి అప్పగింత

టీడీపీ శానససభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ను టీడీపీ పార్లమెంటరీ నేతగా చంద్రబాబు నియమించారు. అలాగే శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడిని లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఖరారు చేశారు. రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా సుజనా చౌదరిని నియమించారు.

మరోవైపు ఈరోజు అమరావతిలో జరిగిన సమావేశంలో పార్టీ కార్యాలయం విషయంలో టీడీపీ నేతల మధ్య చర్చ సాగింది. గుంటూరులోని టీడీపీ కార్యాలయం అందరికీ అందుబాటులో లేదనీ, విజయవాడలో అయితే నేతలందరికీ అందుబాటులో ఉంటుందని పలువురు నేతలు పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. విజయవాడలో టీడీపీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు బాధ్యతను కేశినేని నానికి అప్పగించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Sujana Chowdary
galla jayadev
rammohan naidu
  • Loading...

More Telugu News