Andhra Pradesh: నేను వెళ్లడం లేదు.. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడంపై చంద్రబాబు స్పష్టీకరణ!

  • ఇద్దరు ప్రతినిధులను పంపాలని నిర్ణయం
  • రేపు జగన్ ను కలవనున్న నేతలు
  • అనంతరం ప్రమాణస్వీకారానికి హాజరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబుకు ఫోన్ చేసిన జగన్ ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. మరోవైపు ఈరోజు టీడీపీ నేతలు చంద్రబాబును టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు.

తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బ‌ృందాన్ని పంపాలని నిర్ణయించారు. కాగా, ఈ ఇద్దరు నేతలు రేపు ఉదయం తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లి అభినందిస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.

Andhra Pradesh
Chandrababu
Jagan
Telugudesam
YSRCP
oath taking cermony
  • Loading...

More Telugu News