Andhra Pradesh: నవీన్ పట్నాయక్ జీ.. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు!: చంద్రబాబు

  • నేడు ఒడిశా సీఎంగా పట్నాయక్ ప్రమాణ స్వీకారం
  • అభినందనలు తెలిపిన టీడీపీ అధినేత
  • ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారని ఆశాభావం

ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రిగా బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నవీన్ పట్నాయక్ కు అభినందనలు తెలిపారు.

‘వరుసగా ఐదోసారి ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న నవీన్ పట్నాయక్ జీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలను మీరు నెరవేరుస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గానూ 112 చోట్ల బీజేడీ విజయదుందుభి మోగించింది.

Andhra Pradesh
Odisha
Chief Minister
naveen pathnayak
Chandrababu
Twitter
wishes
  • Loading...

More Telugu News