MS Dhoni: నాకు బౌలింగ్ చేస్తూ అక్కడ ఫీల్డింగా?... అనూహ్యంగా బంగ్లాదేశ్ జట్టుకు సలహా ఇచ్చిన ధోనీ!

  • నిన్న బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్
  • బ్యాటింగ్ చేస్తూ ఫీల్డర్ ను సెట్ చేసిన ధోనీ
  • వైరల్ అవుతున్న వీడియో

భారత జట్టు స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఎలా ఉంటాడోనన్న సంగతి అందరికీ తెలిసిందే. మైదానంలో చురుకుగా కదులుతూ, తాను కెప్టెన్ కాకపోయినా, ఫీల్డింగ్ సెట్ చేస్తూ, కోహ్లీకి అండదండగా నిలబడతాడు. అదే ధోనీ, అనూహ్యంగా ప్రత్యర్థి జట్టుకు సలహాలు ఇచ్చి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. నిన్న బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్ లో 78 బంతుల్లోనే 113 పరుగులు చేసిన ధోనీ, భారత జట్టు భారీ స్కోర్ చేయడానికి తనవంతు సహకారాన్ని అందించాడు. ఇక మ్యాచ్ 40వ ఓవర్ లో బంగ్లాదేశ్ బౌలర్ షబ్బీర్ రెహమాన్ బౌలింగ్ చేస్తున్న వేళ, అతని బౌలింగ్ ను ఆపిన ధోనీ, ఓ ఫీల్డర్ అక్కడ ఉండక్కర్లేదని చెప్పాడు. ఇది మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరచగా, రెహమాన్ సైతం ధోనీ సలహాను స్వీకరించి, ఫీల్డర్ ను అక్కడి నుంచి మరో స్థానానికి పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News