Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు!

  • నెల్లూరు జిల్లా మడమలూరులో ఘటన
  • నిన్న రాత్రి శ్రీనివాసులుపై దాడి
  • మృతదేహం పోస్ట్ మార్టంకు తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులును గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. నిన్న రాత్రి బైక్ పై ఇంటికి వస్తున్న శ్రీనివాసులును మార్గమధ్యంలో అడ్డగించిన దుండగులు కత్తులతో నరికి చంపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

ఈరోజు ఉదయం శ్రీనివాసులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Nellore District
Telugudesam
activist dead
killed
Police
  • Loading...

More Telugu News