Telugudesam LP: టీడీపీ శాసన సభా పక్షం నేతగా చంద్రబాబు ఎన్నిక

  • ఏకవాక్య తీర్మానంతో బలపరిచిన ఎమ్మెల్యేలు
  • ఉండవల్లిలోని బాబు నివాసంలో జరిగిన ఎల్పీ సమావేశం
  • పార్టీ ఓటమి, భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చ

తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేతగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాస గృహంలో జరిగిన టీడీపీ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానంతో బాబును ఎన్నుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం, 23 సీట్లకే టీడీపీ పరిమితం కావడం కారణంగా శాసన సభా పక్షం నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చునన్న ఊహాగానాలు చెలరేగాయి. ఈ ఊహాగానాలకు నిన్ననే పార్టీ వర్గాలు తెరదించాయి. ఈరోజు ఎన్నిక కూడా పూర్తికావడంతో ఈ ఊహాగానాలకు తెరపడినట్టే. కాగా, టీడీఎల్పీ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు, భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చించారు. రేపు విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లాలా?వద్దా? అన్న అంశంపైనా చర్చిస్తున్నారు.

Telugudesam LP
Chandrababu
Undavalli
  • Loading...

More Telugu News