jagan: పుదుచ్చేరి మంత్రికి జగన్ ఫోన్,, హాజరవుతానన్న మల్లాడి!

  • మల్లాడి కృష్ణారావుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్
  • ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వైసీపీ అధినేత
  • హాజరవుతానని చెప్పిన మల్లాడి

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురికి జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. తాజాగా పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మల్లాడి స్వయంగా వెల్లడించారు. తనకు జగన్ ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ప్రమాణస్వీకారానికి వెళ్తున్నానని చెప్పారు. జూన్ 10లోగా జగన్ తో మరోసారి భేటీ అవుతానని... యానాంకు సంబంధించిన సరిహద్దు సమస్యను ఆయనకు వివరిస్తానని తెలిపారు.  

jagan
oath
malladi krishna rao
pudicherry
  • Loading...

More Telugu News