Andhra Pradesh: మరికాసేపట్లో ఉండవల్లిలో టీడీపీఎల్పీ భేటీ!

  • నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు టీడీపీ సిద్ధం
  • నేడు చంద్రబాబు నివాసంలో ప్రత్యేక సమావేశం
  • అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాలు దక్కించుకున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ శానస సభాపక్షం సమావేశం కానుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగే ఈ భేటీలో చంద్రబాబును టీడీపీ నేతలు శాసనసభా పక్షనేతగా ఎన్నుకోనున్నారు.

అలాగే ఈ భేటీలో ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే శాసనసభాపక్ష ఉపనేతను కూడా ఎన్నుకుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ వైసీపీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించగా, టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Telugudesamlp leader
  • Loading...

More Telugu News