Mimi Chakravarthi: మోడ్రన్ దుస్తుల్లో మన ఎంపీలు... వారిని చూసి నెటిజన్ల చివాట్లు!

  • లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన సినీతారలు
  • పార్లమెంట్ ముందుకు మోడ్రన్ దుస్తుల్లో మిమి చక్రవర్తి, సుస్రత్ జహాన్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

వారిద్దరూ ఎంపీలు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. వారు తమకు మేలు చేస్తారని ఓటర్లు గెలిపించారు. కానీ, సినీ తారలైన వారు, తమ సహజశైలిని వదల్లేక పోయారు. తాము ప్రజలకు ప్రతినిధులమని, ఎంతో బాధ్యత తమ మీద ఉందని మరిచి, మోడ్రన్ దుస్తులు ధరించి పార్లమెంట్ ముందు పోజులిచ్చారు. అంతేకాదు... తామేదో ఘనకార్యం చేసినట్టు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే... విమర్శలు వెల్లువెత్తాయి.వారే బెంగాలీ నటీమణులు మిమి చక్రవర్తి, సుస్రత్ జహాన్. వీరిద్దరూ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ టికెట్లను సంపాదించుకుని, ఎన్నికల్లో విజయం సాధించారు. అంతవరకూ బాగానే ఉంది. ఆపై ఇద్దరూ, ఎంపీలుగా తమకిచ్చిన ఐడీ కార్డులు తీసుకుని పార్లమెంట్ ముందుకు వెళ్లి, ఫొటోలకు పోజులిచ్చారు. ఓ దేవాలయంలా అత్యంత పవిత్రంగా భారత ప్రజలు భావించే పార్లమెంట్ కు పాశ్చాత్య దుస్తులు ధరించి వెళ్లారు.వారు తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాధ్యతగల ఎంపీలు ఇలా చేయడం ఏంటని నెటిజన్లు తిట్ల దండకాన్ని అందుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News