Hyderabad: రీవాల్యుయేషన్ లోనూ మార్కులు రాలేదని... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

  • హైదరాబాద్, జవహర్ నగర్ లో ఘటన
  • అనుకున్న మార్కులు రాలేదని మానస మనస్తాపం
  • ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం

ఇంటర్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాల్లోనూ తాను అనుకున్న మార్కులు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మానస ఇంటర్ చదువుతోంది. ఫలితాల్లో ఆమెకు తాననుకున్న మార్కులు రాలేదు. ఆపై ఇటీవలి రీవాల్యుయేషన్‌ లోనూ మార్కులు పెరగలేదు. దీంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గుర్తించిన మానస కుటుంబీకులు, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మానస ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు.

Hyderabad
Inter
Results
Revaluations
  • Loading...

More Telugu News