kishan reddy: కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి.. బొకేలకు బదులు బుక్స్ తెమ్మన్న బీజేపీ నేత!

  • ఇటీవలి ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం
  • అభినందించేందుకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు వద్దన్న నేత
  • పుస్తకాలు తీసుకురావాలన్న పిలుపునకు విశేష స్పందన

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనను అభినందించేందుకు వచ్చే మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ఎవరూ పుష్పగుచ్చాలు, పూలదండలు, శాలువాలు తీసుకురావొద్దని, వాటికి బదులు నోటు పుస్తకాలు తీసుకురావాలని కోరారు.

కిషన్‌రెడ్డి పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. ఆయనను అభినందించేందుకు వచ్చిన వారు నోటు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చి అభినందిస్తున్నారు. అలా ప్రతి ఒక్కరు పుస్తకాలు తీసుకురావడంతో ఓ గది నిండిపోయింది. పుస్తకాలను తీసుకొచ్చిన అందరికీ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

kishan reddy
BJP
secunderabad
note books
Telangana
  • Loading...

More Telugu News