Vijayawada: జగన్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఐదు రకాల పాసులు ఇస్తున్నాం: కలెక్టర్ ఇంతియాజ్

  • విజయవాడలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి
  • పాసులు ఉన్న వారు ఉదయం 10 గంటలలోపే రావాలి
  • మొత్తం 14 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు

ఈ నెల 30న ఏపీ కొత్త సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి మొత్తం ఐదు రకాల పాసులు ఇస్తున్నట్టు వివరించారు. పాసులు ఉన్న వారు వేదికకు ఉదయం పది గంటలలోపే చేరుకోవాలని సూచించారు. ఎల్ఈడీ స్క్రీన్స్, ఫోర్ సైడ్ వ్యాన్ల ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘లైవ్’ ఉంటుందని అన్నారు. స్క్రీన్ ఏర్పాటు చేసిన చోట్ల ప్రజలకు మజ్జిగ, వాటర్, స్నాక్స్ అందిస్తామని చెప్పారు. మొత్తం 14 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు ఇంతియాజ్ వివరించారు. 

Vijayawada
YSRCP
jagan
collector
Intiaz
  • Loading...

More Telugu News