pavan: హీరోగా పవన్.. దర్శకుడిగా బోయపాటి .. బండ్ల గణేశ్ భారీ సినిమా?

  • తిరిగి సినిమాల్లోకి పవన్ కల్యాణ్ 
  • 40 కోట్లు ఆఫర్ చేసిన బండ్ల గణేశ్ 
  • దర్శకుడిగా రంగంలోకి బోయపాటి 

పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించారు. సభలు .. సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యనే వున్నారు. అలుపెరగని పోరాటం చేసినా, ఆయనని అపజయమే వరించింది. మరో ఐదేళ్ల వరకూ చేసేదేమీ లేకపోవడం వలన, ఈ గ్యాపులో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రం చేయడానికి బండ్ల గణేశ్ సిద్ధమవుతున్నాడట. ఆల్రెడీ పవన్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. పారితోషికంగా 40 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా సమాచారం. ఇక దర్శకుడిగా బోయపాటిని సెట్ చేసే ప్రయత్నం కూడా చేశాడనీ, ఆయనకి 10 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశాడని అంటున్నారు. మిగతా ఆర్టిస్టుల పారితోషికాలు .. ఇతర ఖర్చులన్నీ కలుపుకుని మరో 50 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 

pavan
boyapati
  • Loading...

More Telugu News