Hyderabad: ఓ మహిళ ఫిర్యాదుతో కేఏ పాల్ పై క్రిమినల్ కేసు నమోదు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a7d6212dcdaa3f74daa010b7ce4fc52fd4f643bb.jpg)
- అమెరికా పంపిస్తానంటూ పాల్ మోసం చేశారు
- డబ్బులు తీసుకుని చుట్టూ తిప్పుకున్నారు
- పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ
ఓ మహిళ ఫిర్యాదుతో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ కు చెందిన మహిళా పారిశ్రామిక వేత్త
సత్యవతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆమె అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా స్పాన్సర్ షిప్ లెటర్ కోసం పాల్ కు రూ.15 లక్షల చెక్కు ఇచ్చానని, ఆ డబ్బు డ్రా చేసుకున్న తర్వాత తనను మోసం చేశారని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. కేఏ పాల్ అనుచరులు జ్యోతి, విజయ్ పైనా కేసు నమోదైంది.