Andhra Pradesh: కొన్ని మీడియా సంస్థలు ఇంకా తమ బుద్ధి మార్చుకోవట్లేదు!: వైసీపీ నేత పార్ధసారథి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d8cb4042e0b784d2cb3e001a5e87d09b1b74a32d.jpg)
- ఏపీలో వైసీపీకి అఖండ విజయం
- జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారు
- ‘హోదా’, విభజన అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
ఏపీలో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచి, జగన్ సీఎం కాబోతున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు ఇంకా తమ బుద్ధి మార్చుకోవడం లేదని ఆ పార్టీ నేత పార్ధసారథి విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో వైసీపీకి అఖండ విజయాన్ని అందించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు
. వైఎస్ జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని, ప్రజల గుండెల్లో స్థానం పొందాలన్నదే ఆయన ఆకాంక్ష అని అన్నారు. ప్రజా సమస్యలపై జగన్ నిరంతరం పోరాడారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాజ్యాంగ విలువలు కాపాడారని అన్నారు. ‘హోదా’, విభజన అంశాలపై తప్పకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ఏ స్థాయిలోనైనా పోరాడతామని పార్ధసారథి స్పష్టం చేశారు.