Tv9: ముందస్తు బెయిల్ కోసం ‘సుప్రీం’ను ఆశ్రయించిన టీవీ 9’ మాజీ సీఈఓ రవిప్రకాశ్

  • ‘టీవీ 9’లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసు
  • ‘సుప్రీం’ను ఆశ్రయించిన రవిప్రకాశ్, శివాజీ 
  • సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు రానున్న పిటిషన్

‘టీవీ 9’లో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఫై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యాహ్నం విచారణ జరపనుంది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అక్రమంగా తనను ఇరికించారంటూ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో రవిప్రకాశ్ పేర్కొన్నట్టు సమాచారం. రవిప్రకాశ్ తరపున న్యాయవాది అహ్లువాలియా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

Tv9
Ravi prakash
Supreme Court
artist
shivaji
  • Error fetching data: Network response was not ok

More Telugu News