Gorantla Madhav: గోరంట్ల మాధవ్ కు కన్నడ నాట పెరుగుతున్న ఫ్యాన్స్... పత్రికల్లో ప్రత్యేక కథనాలు!

  • సీఐ ఉద్యోగానికి రాజీనామా
  • పోటీపడ్డ తొలి ఎన్నికల్లోనే ఘన విజయం
  • పొగడ్తలు కురిపిస్తున్న నెటిజన్లు

పోలీసు శాఖలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తూ, అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కి, ఆపై ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ తరఫున ఎంపీగా ఘన విజయం సాధించిన గోరంట్ల మాధవ్ కు కర్ణాటకలో ఫ్యాన్స్ పెరుగుతున్నారు. పోటీ పడిన తొలి ఎన్నికల్లోనే భారీ మెజారిటీతో ఆయన గెలవడం, సరిహద్దు నియోజకవర్గం కావడంతో కర్ణాటకలోనూ మాధవ్ గురించి విచారిస్తున్నారు. అక్కడి పత్రికలు, మీడియా మాధవ్ పై ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి. ఆయన గెలుపును పక్కనబెడితే, ఉన్నతాధికారికి సెల్యూట్ చేస్తుండగా తీసిన ఫోటోను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. మాధవ్ గొప్పవాడని, భేషజాలు లేకుండా కనిపిస్తున్నాడని, అధికారదర్పం కూడా ఆయనలో లేదని పొగడ్తలు కురిపిస్తున్నారు.

Gorantla Madhav
Hindupuram
MP
Karnataka
  • Loading...

More Telugu News