Guntur District: గుంటూరు ఎంపీ సీటు మాదే... న్యాయపోరాటంతో సాధిస్తామన్న విజయసాయి రెడ్డి!

  • అన్ని ఓట్లనూ లెక్కించలేదు
  • రిటర్నింగ్ అధికారి పక్షపాతం
  • కోర్టుకు వెళ్లనున్నామన్న విజయసాయి

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో పోలైన అన్ని ఓట్లనూ లెక్కించకుండా రిటర్నింగ్ అధికారి టీడీపీ గెలిచినట్టు ప్రకటించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. దీనిపై న్యాయపోరాటం చేయనున్నామని ఆయన అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించ లేదు. ఆర్వో అక్రమానికి పాల్పడి టిడిపి 4200 తో గెల్చినట్టు ప్రకటించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం" అని అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటును గల్లా జయదేవ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున పోటీచేసిన మోదుగుల గట్టి పోటీని ఇచ్చి, చివరకు స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు.



  • Loading...

More Telugu News