Tirumala: తిరుమలకు నడిచివెళ్లి తలనీలాలు సమర్పించుకున్న గోపాలకృష్ణ ద్వివేది!

  • విజయవంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
  • అదనపు సీఈఓతో కలిసి నడిచిన ద్వివేది
  • స్వామికి మొక్కులు చెల్లింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా పూర్తయిన కారణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తిరుమలకు వచ్చి తన మొక్కులు చెల్లించుకున్నారు. అదనపు సీఈవో వివేక్‌ యాదవ్‌ తో కలిసి తిరుపతికి వచ్చిన ఆయన అలిపిరి మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు.

ఆపై వారిద్దరూ స్వామివారికి తలనీలాలు సమర్పించి, వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ద్వివేది, పోలింగ్‌ శాతం పెరిగిన విషయంలో ఇండియాలోనే ఏపీ రెండో స్థానంలో ఉందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 80.3 శాతం పోలింగ్ నమోదైందని, మహిళా ఓటింగ్‌, వికలాంగులు, పోస్టల్‌ బ్యాలెట్‌ వంటి అన్ని విభాగాల్లోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయని అన్నారు.

  • Loading...

More Telugu News