Jagan: కడపకు బయలుదేరిన వైఎస్ జగన్... ఘన స్వాగతం పలికేందుకు వేచిచూస్తున్న కార్యకర్తలు!

  • ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి కడప జిల్లాకు
  • ఇడుపులపాయలో తండ్రి ఘాట్ వద్ద నివాళి
  • ఆపై తిరుమలకు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కాబోయే సీఎం వైఎస్ జగన్, తొలిసారిగా నేడు కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మరో రెండు గంటల వ్యవధిలో ఇడుపులపాయకు చేరుకోనున్న జగన్, అక్కడి తన తండ్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. కడప నుంచి ఇడుపులపాయకు చేరుకునే సమయంలో జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు మార్గమధ్యంలో నేతలు, కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో పర్యటన అనంతరం ఈ సాయంత్రం తిరుపతి, ఆపై తిరుమలకు చేరుకునే జగన్, రాత్రికి కొండపైనే బసచేసి, రేపు ఉదయం స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సైతం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Jagan
Kadapa District
Pulivendula
Tirumala
  • Loading...

More Telugu News