Jagan: జగన్‌తో కలిసి పనిచేసేందుకు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఆసక్తి!

  • ఓబులాపురం గనుల లీజు వ్యవహారంలో సీబీఐ కేసు 
  • జైలుకు కూడా వెళ్లొచ్చిన శ్రీలక్ష్మి
  • ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం గనుల లీజు వ్యవహారంలో చిక్కుకుని జైలుకు వెళ్లొచ్చిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పుడు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.  ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. ఇప్పుడు ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో ఆమె ఏపీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. శ్రీలక్ష్మితోపాటు మరికొందరు అధికారులు కూడా డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

Jagan
Andhra Pradesh
Sri Laxmi IAS
Obulapuram
  • Loading...

More Telugu News