dammalapati srinivas: ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ పదవికి దమ్మాలపాటి రాజీనామా

  • మే 2016లో ఏజీగా నియామకం
  • మూడేళ్లపాటు ఏజీగా సేవలు
  • ఫలితాలు వెలువడిన రోజే రాజీనామా

గత మూడేళ్లుగా ఏపీ అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా సేవలు అందించిన దమ్మాలపాటి శ్రీనివాస్ పదవి నుంచి వైదొలిగారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. మే 2016లో ఆంధ్రప్రదేశ్ ఏజీగా నియమితులైన ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. వైసీపీ చీఫ్ జగన్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో దమ్మాలపాటి తన పదవికి రాజీనామా చేశారు.

dammalapati srinivas
Andhra Pradesh
AG
Jagan
  • Loading...

More Telugu News