Gali janardhana reddy: జగన్ గొప్ప సీఎంగా నిలిచిపోతారు: గాలి జనార్దనరెడ్డి

  • రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న గాలి
  • బీజేపీ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న కర్ణాటక నేత
  • జగన్ తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తారన్న జనార్దనరెడ్డి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోమారు ఘన విజయాన్ని అందుకుని రెండోసారి అధికారంలోకి రావడంతో సోమవారం ఆయన కర్నూలు జిల్లాలోని మంత్రాలయం చేరుకుని రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.

స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం గాలి మాట్లాడుతూ.. ఏపీ సీఎంగా జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నట్టు తెలిపారు.

Gali janardhana reddy
Karnataka
BJP
Jagan
YSRCP
  • Loading...

More Telugu News