Flight: విమానం దిగి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన వాహనం.. మృతి

  • ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న వెంకటస్వామి
  • ఇంటికెళ్లేందుకు జాతీయ రహదారి పైకి వచ్చారు
  • వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి

విమానం దిగి ఇంటికి వెళదామని జాతీయ రహదారిపైకి వచ్చాడో లేదో ఓ వ్యక్తి మృత్యువు పాలయ్యాడు. నేడు వెంకటస్వామి(42) అనే వ్యక్తి ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానం దిగి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారి పైకి వచ్చారు. రోడ్డు దాటుతుండగా టాటా మ్యాజిక్ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

Flight
venkata Swamy
Delhi
Gannavaram
TATA Mazic
Police
  • Loading...

More Telugu News