Andhra Pradesh: ఏపీలో కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇస్తాం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తాం
  • కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలా సహకరిస్తాం
  • ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయం

ఏపీలో కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇస్తామని, ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్రకటన చేస్తాయని నమ్ముతున్నట్టు చెప్పారు. కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం అవసరానికి మించి సేకరించిన భూములను పేదలకు ఇవ్వాలని సూచించారు. రాయలసీమకు అన్యాయం చేస్తే కొత్త రాష్ట్రం డిమాండ్ తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయమని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Andhra Pradesh
bjp
Vishnu Vardhan Reddy
YSRCP
  • Loading...

More Telugu News