Adavi sesh: కోర్టు వివాదంలో చిక్కుకున్న రాజశేఖర్ కుమార్తె సినిమా!

  • శివానీ కథానాయికగా తెరకెక్కుతున్న ‘టూ స్టేట్స్’
  • కథలో మార్పులు చేశారని దర్శకుడి ఆరోపణ
  • తనను తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటున్న దర్శకుడు

సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ, అడవి శేష్ జంటగా ‘టూ స్టేట్స్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘2 స్టేట్స్’. దీనికి తెలుగు రీమేక్‌గా అదే టైటిల్‌తో దర్శకుడు వెంకట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోర్టు వివాదంలో చిక్కుకుంది.

ఈ సినిమా నిర్మాత ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) తనకు తెలియకుండా తన కథలో మార్పులు చేశారని, సినిమా నుంచి తనను తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వెంకట్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు నిర్మాత సత్యనారాయణను ఈ నెల 30న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘టూ స్టేట్స్’ చిత్రీకరణ ఇంకా 30 శాతమే మిగిలి ఉందని, తనను కాదని ప్రాజక్టులోకి వచ్చే దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. 

Adavi sesh
Shivani
Rajasekhar
Two States
Chetan Bhagath
Venkat Reddy
  • Loading...

More Telugu News