Krishna District: రైతుల పేరిట రుణం.. రూ.కోటి స్వాహా చేసిన బ్యాంకు ఉద్యోగి!

  • కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో ఘటన
  • ఎస్బీఐ పరిటాల బ్రాంచ్ లో క్యాషియర్ చేతి వాటం
  • సుమారు 90 నకిలీ ఖాతాలు సృష్టించినట్టు ఆరోపణలు

రైతులు తీసుకున్న రుణానికి వారి పేరిటే రెట్టింపు తీసుకుని ఆ మొత్తాన్ని స్వాహా చేసిన బ్యాంకు ఉద్యోగి ఉదంతం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. కంచికచర్ల మండలంలోని పరిటాల ఎస్బీఐ బ్రాంచ్ లో పని చేసే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. పొలం పనుల కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి  రైతులు రుణం తీసుకున్నారు. అయితే, వాస్తవానికి రైతులు తీసుకున్న ఋణం ఒకటైతే, వారికి తెలియకుండా వారి పేరు మీదే రెట్టింపు రుణాన్ని తీసుకుని ఆ మొత్తాన్ని క్యాషియర్ శ్రీనివాసరావు స్వాహా చేసినట్టు ఆరోపణలు తలెత్తాయి. ఇందుకోసం నిందితుడు సుమారు 90 నకిలీ ఖాతాలు సృష్టించినట్టు బ్యాంకు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు కోటి రూపాయల వరకు శ్రీనివాసరావు తినేసినట్టు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు ఇప్పటికే పరారీలో ఉన్నట్లు సమాచారం.

Krishna District
paritala
sbi
farmers
gold loan
  • Loading...

More Telugu News