Telangana: కవిత, వినోద్ కుమార్ లను ఓడించింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే!: జీవన్ రెడ్డి సంచలన ఆరోపణ

  • టీఆర్ఎస్ ఓట్లే బీజేపీకి వెళ్లాయి 
  • కేసీఆర్, కేటీఆర్ కు అంత అహంకారం పనికిరాదు
  • జగిత్యాలలో మీడియాతో కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత, కరీంనగర్ లో బి.వినోద్ కుమార్ ఓటమికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని ఆయన అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడలేదనీ, వారికి వెళ్లిన ఓట్లన్నీ టీఆర్ఎస్ వేనని స్పష్టం చేశారు. జగిత్యాలలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.

బావ కంటే ఒక్క ఓటు ఎక్కువ తెస్తానన్న కేటీఆర్.. ప్రజల నాడిని తెలుసుకోలేక బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ లకు అహంకారం ఎక్కువయిందనీ, అంత అహంకారం పనికిరాదని హితవు పలికారు. కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి  వినోద్ కుమార్ ఓటమికి కేటీఆరే కారణమని స్పష్టం చేశారు. ఒక్క సిరిసిల్లలోనే టీఆర్ఎస్ 50,000 ఓట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

Telangana
TRS
Congress
JEEVAN RESSY
K Kavitha
vinod kumar
  • Loading...

More Telugu News