Telangana: కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలంటే కొత్త వర్కింగ్ కమిటీని నియమించాలి!: మర్రి శశిధర్ రెడ్డి

  • కాంగ్రెస్ చీఫ్ గా రాహులే కొనసాగాలి
  • రాహుల్ రాజీనామాను తిరస్కరించడం హర్షణీయం
  • హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీయే కొనసాగాలని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోరారు. నిజంగా పార్టీలో ప్రక్షాళన జరగాలంటే కొత్త వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో పార్టీని తీర్చిదిద్దాలని సూచించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 స్థానాలతో చతికిలపడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయదుందుభి మోగించింది.

Telangana
Congress
cwc
Rahul Gandhi
marri
sashidhar reddy
Hyderabad
  • Loading...

More Telugu News