Andhra Pradesh: అందుకే వైసీపీ అధినేతను ‘జలగ జగన్’ అని పిలిచా!: సాధినేని యామిని

  • చంద్రబాబును జగన్ కాల్చి చంపాలన్నారు
  • ఉరివేయాలని కూడా వ్యాఖ్యానించారు
  • మా నాయకుడిని సమర్థించాల్సిన బాధ్యత నాపై ఉంది

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉరి తీయాలనీ, నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. తమ పార్టీ అధినేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఓ కార్యకర్తగా తనపై ఉందన్నారు. అందుకే వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ ను తాను ‘జలగ జగన్’ అని సంబోధించానని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాధినేని యామిని మాట్లాడారు.

రాజకీయాల్లో పరిజ్ఞానం కావాలంటే ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు కావాల్సిన అవసరం లేదని సాధినేని యామిని తెలిపారు. తనకు ఆగమేఘాల మీద టీడీపీలో అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టలేదని యామిని స్పష్టం చేశారు. అలా ఇచ్చే పనైతే 2014లోనే తనకు పదవి వచ్చేదని స్పష్టం చేశారు. ఈరోజు ప్రియాంకా గాంధీ, వైఎస్ షర్మిల, బ్రాహ్మణితో పాటు తన గురించి కూడా సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Jagan
jalaga
sadhineni yamini
Telugudesam
  • Loading...

More Telugu News