ranveer singh: రణ్ వీర్ సింగ్ కొత్త చిత్రానికి మాస్ టైటిల్

  • విలక్షణ హీరోగా రణ్ వీర్ సింగ్ 
  • సెట్స్ పై కపిల్ దేవ్ బయోపిక్ 
  • త్వరలో 'జయేశ్ భాయ్ - జోర్దార్'  

వరుస సినిమాలతో .. వరుస విజయాలతో రణ్ వీర్ సింగ్ దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందుతోన్న '83' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సెట్స్ పైకి వెళ్లడానికి ఆల్రెడీ మరో ప్రాజెక్టును ఆయన లైన్లో పెట్టేశాడు.

మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లిన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుందట. ఈ సినిమాకి 'జయేశ్ భాయ్ - జోర్దార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దివ్యాంగ్ టక్కర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. '83' మూవీ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని రణ్ వీర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు

  • Loading...

More Telugu News