Jagan: విజయవాడకు చేరుకున్న జగన్!

  • ముగిసిన రెండు రోజుల ఢిల్లీ పర్యటన
  • ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు
  • నేరుగా తాడేపల్లికి వెళ్లనున్న జగన్

తన రెండు రోజుల న్యూఢిల్లీ పర్యటనను ముగించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం తిరిగి విజయవాడకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు జగన్ రాగా, స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. వారంతా "సీఎం... సీఎం" అని నినాదాలు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్న జగన్, మధ్యాహ్నం తరువాత ముఖ్య నేతలు, కొందరు అధికారులతో సమావేశం కానున్నారు. ఆపై రేపు, ఎల్లుండి జగన్ కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Jagan
Vijayawada
New Delhi
Gannavaram
  • Loading...

More Telugu News