Andhra Pradesh: జగన్ లో ప్రజలు మాస్ లీడర్ ను చూశారు.. ప్రజల్లోకి ఆయన చొచ్చుకుపోయారు!: సాధినేని యామిని

  • ఏపీ ప్రజల కోసం బాబు చాలా చర్యలు తీసుకున్నారు
  • అయితే సంక్షేమ ఫలాలు అందరికీ చేరలేదనిపిస్తోంది
  • యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి కావాలో, నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలన్న విషయమై మాజీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా తేడా లేదని ఆమె చెప్పారు. కానీ టీడీపీ తెచ్చిన పథకాలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాధినేని యామిని మాట్లాడారు. ఓ ప్రతిపక్ష నేతగా వైసీపీ అధినేత జగన్ వైఫల్యం చెందారని మీడియా, ప్రజలతో పాటు తామూ భావించామని యామిని అన్నారు. ‘తండ్రి రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన మాస్ లీడర్ షిప్, వారికంటూ ఉన్న ఓటు బ్యాంకు కానీ మేం ఎన్ని చెప్పినా, ఆయనపై ఎన్ని కేసులు పడినా ప్రజలు ఆయనలో ఓ నాయకుడిని చూసి ఉంటారు.

ప్రజలు ఆయనలో ఓ పాజిటివ్ నెస్ ను తీసుకున్నట్లు ఉన్నారు’ అని తెలిపారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరడం, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని పోవడం వైసీపీకి కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు తాను వ్యతిరేకంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
sadhineni yamini
Telugudesam
  • Loading...

More Telugu News