Andhra Pradesh: లగడపాటిపై పోలీస్ కేసు పెట్టిన లాయర్ మురళీకృష్ణ!

  • ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే
  • కొవ్వూరుకు చెందిన లాయర్ ఫిర్యాదు
  • లగడపాటి కారణంగా చాలామంది నష్టపోయారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి రాజగోపాల్ పై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన తప్పుడు సర్వేల కారణంగా చాలామంది నష్టపోయారని మురళీకృష్ణ తెలిపారు. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Andhra Pradesh
LAGADAPATI
Police
case
murali krishna
  • Loading...

More Telugu News