YS Avinash Reddy: కబడ్డీ ఆడుతూ కిందపడిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి... వీడియో!

  • వైఎస్ అవినాశ్ చేతిలో ఓడిపోయిన ఆదినారాయణరెడ్డి
  • స్వగ్రామంలో స్థానికులతో కబడ్డీ
  • కిందపడిపోగా లేవదీసిన సెక్యూరిటీ సిబ్బంది

తాజా ఎన్నికల్లో ఓటమి బాధను మరచిపోవాలని భావించారో ఏమో, కడప లోక్ సభకు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, తన అనుచరులతో కలిసి కబడ్డీ ఆడుతూ, అందులోనూ విఫలమయ్యారు. వైఎస్ అవినాశ్ రెడ్డి చేతిలో భారీ మెజారిటీ తేడాతో ఓడిపోయిన ఆయన, జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలోని తన నివాసం సమీపంలోనే స్థానిక యువకులతో కబడ్డీ ఆడి కాసేపు సేదదీరాలని భావించారు. ఆయన కూతకు వెళ్లిన సమయంలో కట్టుకున్న పంచె కాళ్లకు అడ్డం పడి కిందపడిపోగా, ఆడుతున్న యువకులు, సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లేవనెత్తారు. ఆపై ఆయన తన ముఖాన్ని నీటితో కడుక్కుని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News