jaganmohanreddy: ఢిల్లీ నుంచి నేడు జగన్‌మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణం...నేరుగా తాడేపల్లికి!

  • ఉదయం 10 గంటలకు బయలుదేరనున్న ప్రత్యేక విమానం
  • మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు
  • అక్కడి నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న అనంతరం ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తన ఒకరోజు పర్యటన పూర్తి చేసుకుని ఈరోజు తిరిగి ఏపీకి వస్తున్నారు. నిన్న ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత ప్రధాని నరేంద్రమోదీ, తర్వాత బీజేపీ చీఫ్‌ అమిత్‌షాలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆంధ్రాభవన్‌కు చేరుకున్న జగన్‌ అక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ క్యాడర్‌ అధికారుల అభినందలను అందుకున్నారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాత్రికి ఢిల్లీలోనే బసచేసిన జగన్‌ ఈరోజు ఉదయం పది గంటలకు బయలుదేరి 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి వస్తారు.

jaganmohanreddy
New Delhi
retun journey
tadepalli
  • Loading...

More Telugu News