Arun Jaitly: అరుణ్ జైట్లీ ఆరోగ్యంగా ఉన్నారు.. మీడియా సంయమనం పాటించాలి: కేంద్ర ప్రభుత్వం

  • అరుణ్ జైట్లీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ కథనాలు
  • చికిత్స కోసం లండన్, అమెరికా వెళ్లనున్నారంటూ ప్రచారం
  • వార్తలు పూర్తిగా అవాస్తవమన్న ప్రభుత్వం

అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వ అధికార ప్రతినిధి సితాన్షుకర్‌ ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు. జైట్లీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, రెండోసారి ఆయన ఆర్థిక శాఖను చేపట్టే అవకాశం లేదంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. చికిత్స కోసం ఆయన అమెరికా లేదంటే బ్రిటన్ వెళ్లే అవకాశం ఉందని వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది.

అరుణ్ జైట్లీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనపై వస్తున్న వార్తలు పూర్తిగా సత్యదూరమని అరుణ్ జైట్లీ కాలేజీ స్నేహితుడు, మీడియా దిగ్గజం రజత్‌ శర్మ కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, పూర్తిగా కోలుకున్నారని ఆయన తెలిపారు.

Arun Jaitly
health
London
America
BJP
  • Loading...

More Telugu News