KPHB Police Station: మాజీ భార్య భర్తను కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు.. కేసు నమోదు

  • కరిష్మాను వివాహం చేసుకున్న విద్యాసాగర్
  • మనస్పర్థలు రావడంతో విడాకులు
  • తన భర్తను విద్యాసాగర్ కిడ్నాప్ చేశాడంటున్న కరిష్మా

మాజీ భార్య భర్తను కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఆర్ఎస్వీ నాయకుడు మేకల విద్యాసాగర్ గతంలో కరిష్మా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

అనంతరం కరిష్మా, మౌర్య అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే ప్రస్తుతం తన భర్త మౌర్యను విద్యాసాగర్ కిడ్నాప్ చేశాడని కరిష్మా ఆరోపిస్తోంది. ఈ మేరకు నేడు ఆమె కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే విద్యాసాగర్ టీఆర్ఎస్ నాయకుడు కాకడంతో పోలీసులు పట్టించుకోవట్లేదని కరిష్మా ఆరోపిస్తోంది.

KPHB Police Station
Vidyasagar
Karishma
Mourya
Divorce
Kidnap
  • Loading...

More Telugu News