Disha Patani: కొన్నేళ్లుగా టైగర్‌ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. నా డ్యాన్స్, స్టంట్స్ చూసైనా ఇంప్రెస్ అవుతాడనుకున్నా: దిశా

  • మేమిద్దరం మంచి స్నేహితులమే
  • ఇప్పుడు ‘భారత్’ సినిమాలో నటించా
  • ‘భారత్’లో చాలా స్టంట్స్‌, డ్యాన్స్‌ చేశా
  • ఈసారి అతడితోనే మాట్లాడండి

తాను గత కొన్నేళ్లుగా ప్రముఖ బాలీవుడ్ టైగర్ ష్రాఫ్‌ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని, కనీసం తన డ్యాన్స్, స్టంట్స్ చూసైనా ఇంప్రెస్ అవుతాడని ఆశించానని ప్రముఖ నటి దిశా పటానీ తెలిపారు. గత కొన్ని రోజులుగా టైగర్, దిశా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. వీరిద్దరి ప్రేమ విషయంలో మీడియా ప్రశ్నిస్తే తాము మంచి స్నేహితులమని తెలిపారు. అయితే తాజాగా ఓ అభిమాని దిశాను, ‘మీ మధ్య ప్రేమను ఎందుకు ఒప్పుకోరు. మీరు భార్యాభర్తలు కావడం అందరికీ ఇష్టమే’ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.

ఈ పోస్ట్‌పై స్పందించిన దిశా, ‘‘గత కొన్నేళ్లుగా టైగర్‌ను ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు ‘భారత్’ సినిమాలో నటించా. అందులో చాలా స్టంట్స్‌, డ్యాన్స్‌ చేశా.. అది చూసైనా అతడు ఇంప్రెస్‌ అవుతాడని ఆశించా. కానీ అవలేదు.. నా దురదృష్టం. మేమిద్దరం తినడానికి కలిసి హోటల్‌కు వెళ్తాం. దానర్థం తనకు నేనంటే ఇష్టమని కాదు. ఈసారి అతడితోనే మాట్లాడండి. అతడికీ సిగ్గే, నాకూ సిగ్గే.. చొరవ తీసుకుని చెప్పలేం’’ అని పేర్కొన్నారు.

Disha Patani
Tiger Sharaf
Bollywood
Stunts
Dance
  • Loading...

More Telugu News