Vijayawada: నా తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’: రామ్ గోపాల్ వర్మ

  • విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ 
  • ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ స్టోరీ ఐడియా వచ్చింది
  • కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ప్రకటన చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని ప్రకటించారు. అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని తొలుత ప్రకటించిన వర్మ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం గమనార్హం. విజయవాడ వచ్చిన తర్వాతే తనకు ఈ స్టోరీ ఐడియా వచ్చిందని అన్నారు. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలో లా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ నవ్వులు కురిపించారు. అందుకే, తనకు ఒక ఇన్సిపిరేషన్ వచ్చిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని వర్మ వ్యాఖ్యానించారు.

Vijayawada
lakshmi`s ntr
ram gopal varma
boyapati
  • Loading...

More Telugu News