Andhra Pradesh: టీడీపీలో మొదలైన రాజీనామాల పర్వం.. పార్టీకి గుడ్ బై చెప్పిన చిత్తూరు నేత!

  • గంగాధర నెల్లూరులో టీడీపీ ఓటమి
  • నైతిక బాధ్యత వహిస్తూ ఆనందరెడ్డి రాజీనామా
  • ప్రజల కోసం పోరాడుతామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో రాజీనామాలు ఊపందుకున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా టీడీపీ నేత బండి ఆనందరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ బాధ్యతలతో పాటు జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు బండి ఆనందరెడ్డి తెలిపారు. పెరుమాళ్లపల్లె పోలింగ్‌ కేంద్రం పరిధిలో పార్టీ అభ్యర్థి ఆనగంటి హరికృష్ణకు ఓట్లేయించడంతో తాను విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు తాను నైతిక బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచానా, ఓడినా ప్రజన పక్షాన ఉంటూ పోరాడుతామని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telugudesam
resign
Chittoor District
  • Loading...

More Telugu News