janasena: ‘జనసేన’ అధినేత పవన్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ ఫైర్!

  • జగన్ గురించి ఓ వీధిరౌఢీలా వెలగపూడి మాట్లాడారు
  • జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీనీ చిత్తుగా ఓడిస్తాం
  • ప్రజలు పవన్ ను అసెంబ్లీ గడప తొక్కనివ్వలేదు

విశాఖపట్టణం తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రచార రథంపై నుంచి రామకృష్ణబాబు జగన్ ని అగౌరవపరిచేలా మాట్లాడారు, ఈ విషయమై అమర్నాథ్ మాట్లాడుతూ, ఓ వీధిరౌఢీలా వెలగపూడి మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఆరోజున అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా జగన్ పై అసభ్యకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీనీ చిత్తుగా ఓడిస్తామని అన్నారు.

వెలగపూడికి దమ్ముంటే ఈ ఎన్నికల్లో తన సత్తా చూపించాలని సవాల్ విసిరారు. విశాఖ భూ కుంభకోణంలో పాత్రధారులను అవినీతి, అక్రమాలకు పాల్పడినవారినెవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని జగన్ ని ఓడించాలని పవన్ పిలుపు నిచ్చారని మండిపడ్డారు. అందుకే, ప్రజలు పవన్ ను అసెంబ్లీ గడప తొక్కనివ్వకుండా చేశారని అన్నారు.

janasena
Pawan Kalyan
Telugudesam
vizag
amarnath
  • Loading...

More Telugu News