Jagan: మోదీతో భేటీ సందర్భంగా జగన్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవే!
- ప్రత్యేక హోదా తక్షణ అవసరం అని పేర్కొన్న జగన్
- పెండింగ్ నిధులపై మోదీతో చర్చ
- సహకరించాలంటూ విజ్ఞప్తి
మరి కొన్నిరోజుల్లో ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిశారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడ రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ రాష్ట్రపరిస్థితిని మోదీకి వివరించారు.
జగన్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవే...
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా
- విభజన చట్టంలోని హామీలు అమలు
- ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల
- పోలవరం ప్రాజెక్ట్ కు సహకారం, అదనపు నిధుల మంజూరు
- రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం
- కడప స్టీల్ ప్లాంట్
- దుగరాజపట్నం మేజర్ పోర్టు ఏర్పాటు
- ఏపీ ఆర్థిక పరిస్థితి
- రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు