Ganta Srinivasa Rao: జగన్ చెప్పిన ఆ ఒక్క మాటే ఘన విజయానికి బాటలేసింది: గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు!

  • విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా
  • ఒక్క చాన్స్ ఇవ్వాలన్న జగన్ పిలుపు ప్రజలు ఆకట్టుకుంది
  • టీడీపీ పరాజయంపై విశ్లేషిస్తామన్న గంటా

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ పడిన గంటా, ఓట్ల లెక్కింపు వేళ నెలకొన్న సందిగ్ధతతో ఎంతో ఉత్కంఠతో గడపాల్సి వచ్చింది. చివరకు విజయం ఆయన్నే వరించగా, విశాఖలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను గెలిపించిన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, అయినా ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ ఇచ్చిన పిలుపు ప్రజలను ఎంతో ఆకట్టుకుందదని, అందువల్లే ఇంత ఘన విజయం ఆ పార్టీకి సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. 29వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుందని, దానిలో టీడీపీ ఘోర పరాజయంపై లోతైన విశ్లేషణ జరుగుతుందని చెప్పారు. 

Ganta Srinivasa Rao
Jagan
Vizag
  • Loading...

More Telugu News