AP assembly: అసెంబ్లీలోకి మొదటి సారి అడుగుపెడుతున్న 70 మంది ఎమ్మెల్యేలు

  • వీరిలో 67 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులే
  • టీడీపీకి చెందిన వారు ముగ్గురే
  • సభ్యుల్లో ఒకరు ఎమ్మెల్సీగా, ఇద్దరు ఎంపీలుగా పనిచేసిన అనుభవం

సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది కొత్త వారు కావడం ఈసారి ప్రత్యేకం. నవ్యాంధ్రలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో 70 మంది తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న వారు కావడం గమనార్హం. ఇందులో 67 మంది వైసీపీ శాసన సభ్యులు కాగా, ముగ్గురు మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. కొత్త సభ్యుల్లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి గెలుపొందిన శిల్పా చక్రపాణిరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఉండగా, వి.వరప్రసాద్‌, అనంత వెంకట్రామిరెడ్డిలు పార్లమెంటు సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. మిగిలిన వారంతా చట్ట సభకు కొత్తవారే. టీడీపీ తరపున ఎన్నికైన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ముద్దాలి గిరిధర్‌, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఉండి ఎమ్మెల్యే రామరాజు తొలిసారి శాసనసభలోకి అడుగు పెడుతుండడం విశేషం.

  • Loading...

More Telugu News