Andhra Pradesh: జగన్.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం.. డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేసిన క్లాస్ మేట్స్!

  • బేగంపేటలో శుభాకాంక్షలు తెలుపుతూ బోర్డులు
  • ఏర్పాటుచేసిన 1991 బ్యాచ్ సహచరులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ సీట్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జగన్ క్లాస్ మేట్స్ ఆయనకు వినూత్నంగా అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లోని బేగంపేటలో మెట్రో పిల్లర్స్ పై జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు.


అందులో ‘గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారికి శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం జగన్. ఇట్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1991 ఐఎస్సీ విద్యార్థులు’ అని డిజిటల్ బోర్డులో ముద్రించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

Andhra Pradesh
Jagan
YSRCP
HPS
digital boards
class mates
  • Loading...

More Telugu News