crime news: తండ్రి చేతిలో తనయుడు హతం...చంపాలని వచ్చి తనే ప్రాణాలు కోల్పోయాడు

  • మద్యం మత్తులో తండ్రిపై ఆగ్రహం
  • వివాదంలో ప్రాణాలు కోల్పోయిన వైనం
  • గత కొన్నాళ్లుగా, భార్య, తండ్రితో వివాదం

తండ్రిపై ఆగ్రహంతో పూటుగా మద్యం సేవించి వచ్చి అతన్ని ఉరివేసి చంపాలనుకున్న కొడుకు తండ్రి చేతిలోనే హతమైన ఘటన ఇది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం పరిధి పాపయ్యపల్లికి చెందిన ఉడిగె రాజు (29), బుచ్చయ్యలు తండ్రీకొడుకులు. రాజుకు రాంచంద్రాపురం గ్రామానికి చెందిన యువతితో 2012లో పెళ్లయింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన రాజు తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. అలాగే తండ్రితోనూ ఘర్షణకు దిగేవాడు. రాజు వేధింపులు భరించలేక కొన్నాళ్ల క్రితం రాజు భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పూటుగా మద్యం తాగిన రాజు తండ్రిని ఉరివేసి చంపేస్తానంటూ తాడు పట్టుకుని ఇంటికి వచ్చాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఘర్షణ పడగా రాజు తండ్రి బుచ్చయ్య కొడుకు తెచ్చిన తాడు అతని మెడకే చుట్టి హత్య చేశాడు. బుచ్చయ్య భార్య నర్సవ్వ శనివారం ఉదయం కోడలికి ఫోన్‌చేసి భర్త చనిపోయిన విషయం తెలియజేయడంతో ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకుంది. మామ బుచ్చయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

crime news
man murdered
Karimnagar District
  • Loading...

More Telugu News