Piyush Goyal: బీజేపీకి 303 సీట్లు రావచ్చని ఏడాది ముందే చెప్పిన నేత!

  • 297 నుంచి 303 సీట్లు వస్తాయి
  • 5.40 లక్షల మందితో మాట్లాడామన్న పియూష్ గోయల్
  • గత సంవత్సరమే వెల్లడించిన కేంద్ర మంత్రి

ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 297 నుంచి 303 సీట్లు వస్తాయని ఏడాది క్రితమే చెప్పారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. వృత్తి రీత్యా చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన ఆయన, గత సంవత్సరం ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వేళ ఈ వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడది నిజమైంది. ఆయన చెప్పినన్ని సీట్లను బీజేపీ దక్కించుకోగా, నాటి పియూష్ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

2018 ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 5.40 లక్షల మంది నుంచి అభిప్రాయాలు స్వీకరించానని, తాను జరిపించిన ప్రైవేటు సర్వేలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పడం గమనార్హం. తన టీమ్ ఒక్కొక్కరినీ 30 నిమిషాల పాటు ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిందని నాటి ఇంటర్వ్యూలో పియూష్ వ్యాఖ్యానించారు.

Piyush Goyal
Interview
Economic Times
BJP
  • Loading...

More Telugu News