Naveen patnaik: ఆయన ప్రమాణ స్వీకారం జగన్ కంటే ముందుగానే
- ఈనెల 29న ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్
- ఐదోసారి అధికారంలోకి వస్తున్న బీజేడీ
- సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒడిశా ముఖ్యమంత్రిగా ఈనెల 29వ తేదీన నవీన్‌పట్నాయక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికల్లో నవీన్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఐదోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఒడిశా అసెంబ్లీలో మొత్తం 147 స్థానాలు ఉండగా బీజేడీ 112 స్థానాలు దక్కించుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీకి 23 సీట్లు, ఒకప్పుడు రాష్ట్రాన్ని దీర్ఘకాలం ఏలిన కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు వచ్చాయి. 2000 సంవత్సరంలో తొలిసారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.