Andhra Pradesh: మరికొన్ని గంటల్లో ముగియనున్న ఎన్నికల కోడ్!

  • ఏపీలో దాదాపు మూడు నెలల పాటు కోడ్
  • అసెంబ్లీ ఫలితాలకు 42 రోజుల సమయం
  • అంతకుముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

దాదాపు రెండున్నర నెలలుగా దేశవ్యాప్తంగా అమలులో ఉన్న సార్వత్రిక ఎన్నికల కోడ్‌ మరికొన్ని గంటల్లో ముగియనుంది. మార్చి 18న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన తరువాత కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే, సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఆపై అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరుగగా, ఫలితాలు వెల్లడి కావడానికి 42 రోజుల సమయం పట్టింది. దీంతో ఎన్నికల కోడ్‌ మూడు నెలలు కొనసాగినట్లయింది. కోడ్ అమలులో ఉన్న కారణంగా ఆగిపోయిన ఉపాధ్యాయులు, ఇతర అధికారుల బదిలీలు, తిరిగి ప్రారంభం కానున్నాయి. జూన్‌ తొలి వారంలో బదిలీల ప్రక్రియ తిరిగి మొదలవుతుందని అధికారులు అంటున్నారు.

Andhra Pradesh
Elections
Code
  • Loading...

More Telugu News